బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎంతంటే..?
06 September 2023
బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లు, నగదు ఏటి కేడు కొండలా పేరుకుపోతోందని అధ్యయనాల్లో తేలింది.
ఈ అధ్యయనాల్లో బ్యాంకులతో పాటు స్టాక్ మార్కెట్లలోనూ క్లెయిమ్ చేసుకోని సొమ్ము భారీగా ఉందని తేల్చిచెప్పారు.
ఓ నివేదిక ప్రకారం బ్యాంకింగ్ రంగంలో క్లెయిమ్ కాని నగదు దాదాపు రూ. 1,00,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు.
అలాగే అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో దాదాపు రూ.35,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనావేస్తున్నారు.
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల, నగదును క్లెయిమ్ చేసుకునేందుకు ఇటీవల ఆర్బీఐ ప్రత్యేక వెబ్ పోర్టల్ UDGAM ప్రారంభించింది
ఈ సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను సెర్చ్ చేసి, వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది.
అన్‌క్లెయిమ్డ్ నగదు సమస్య రాకుండా నామినీల వివరాలను బ్యాంకులు తప్పక తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
బ్యాంకులతో పాటు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో వినియోగదారుల నామినీల పేర్లు, చిరునామా వివరాలు తీసుకోవాలని మంత్రి కోరారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి