సేవింగ్స్ ఎకౌంట్స్ ఎన్ని రకాలున్నాయో తెలుసా?

09 September 2023

సేవింగ్స్ ఎకౌంట్ అంటే ఎదో ఒక విధంగానే ఉంటుంది అనుకుంటాం. కానీ, ఇందులోనూ రకాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం

సాధారణ సేవింగ్స్ ఎకౌంట్ : KYC నిబంధనల ప్రకారం పర్సనల్, ఎడ్రస్ గుర్తింపు పత్రాలతో ఈ ఎకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

అయితే మీ బ్యాంక్ ఎకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. మినిమం బ్యాలెన్స్ బ్యాంక్ కు బ్యాంక్ కు మారుతుంది

సాలరీ సేవింగ్స్ ఎకౌంట్ : తమ ఉద్యోగుల కోసం ఉద్యోగ సంస్థలు బ్యాంక్ లో సాలరీ సేవింగ్స్ ఎకౌంట్స్ ఓపెన్ చేస్తాయి.

ప్రతి నెల సంస్థలు సాలరీ ఈ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాయి. ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంచనక్కరలేదు.

ఫామిలీ సేవింగ్స్ ఎకౌంట్: కుటుంబం మొత్తానికి ఒకే ఎకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కుటుంబంలోని అందరూ దీనిని ఆపరేట్ చేయవచ్చు.

మైనర్ సేవింగ్స్ ఎకౌంట్: పదేళ్ళ లోపు పిల్లల కోసం ఈ ఎకౌంట్. తల్లిదండ్రులు లేదా గార్దియన్స్ దీనిని నిర్వహించవచ్చు.

మహిళల సేవింగ్స్ ఎకౌంట్: ఇవి కొన్ని స్పెషల్ ఫీచర్లతో ఉంటాయి. తక్కువ వడ్డీకే లోన్స్, డిస్కౌంట్స్ వంటివి ఉంటాయి. ఇవి బ్యాంకును బట్టి మారుతాయి.