హోమ్ లోన్ ట్రాన్స్ ఫర్ ఈజీ.. బోలెడు డబ్బు మిగులుతుంది
25 September 2023
శాస్త్రీయ విధానంలో పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా జాతీయ పోషకాహార సంస్థ సరికొత్త విధానాన్ని రూపొందించింది.
సొంత ఇల్లు ఉంటే చాలు అనుకుని చాలామంది లోన్ తీసుకుని ఆ కల నెరవేర్చుకుంటారు. దీని కోసం బ్యాంకు లోన్ తీసుకున్న తరువాత కొంత అప్పు తీర్చాకా.. వేరే బ్యాంక్ లో వడ్డీ తక్కువకు లోన్ ఇస్తామని ఆఫర్ రావచ్చు.
ఇలాంటప్పుడు హోమ్ లోన్ ఎకౌంట్ ను వేరే బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకోవడం సహజం. మరి అలా చేయాలంటే ఏమి చేయాలి?
మనం లోన్ తీసుకున్న బ్యాంక్ నుంచి వేరే బ్యాంకుకు మన లోన్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. దీనివలన మన ఈఎంఐ తగ్గుతుంది.
ఇలా లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అలాగే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పెద్దగా డాక్యుమెంటేషన్ పని కూడా ఉండదు.
ఆన్ లైన్ లో కూడా ఇలా బ్యాంకు నుంచి బ్యాంకుకు లోన్ ఎకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లోన్ ప్రాసెస్ కు ఎక్కువ సమయం పట్టదు
లోన్ డాక్యుమెంట్స్ మొదటి లోన్ తీసుకున్న బ్యాంకు నుంచి కొత్త బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతాయి. హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ కోసం ప్రాసెసింగ్ ఫీజులు పెద్దగా ఉండవు
ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వలన క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా అనే అనుమానం ఉండొచ్చు. అటువంటి పరిస్థితి రాదు. క్రెడిట్ స్కోర్ పై ఇది ప్రభావం చూపదు
లోన్ రీపేమెంట్ కూడా పాత బ్యాంకులో ఎలా చేస్తారో అలానే కొత్త బ్యాంకులో చేయవచ్చు. లోన్ ప్రీ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దీని వలన ఈఎంఐ లు తగ్గడంతో ఆర్ధికంగా కొంత వెసులుబాటు కూడా దొరుకుతుంది.