సింగిల్ చార్జ్‌పై 100కి.మీ.. హీరో నుంచి సరికొత్త స్కూటర్‌.. ధర ఎంతంటే

04 March 2024

TV9 Telugu

ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌..తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

హీరో మోటోకార్ప్‌

విదా వీ1 ప్లస్‌ పేరుతో విడుదల చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరను 1.15 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. 

విదా వీ1 ప్లస్‌ పేరుతో..

6 కిలోవాట్ల ఎలక్ట్రిక్‌ మోటర్‌ కలిగిన ఈ మాడల్‌ సింగిల్‌ చార్జింగ్‌తో 100 కిలోమీటర్లు ప్రయాణించనుంది.

ఎలక్ట్రిక్‌ మోటారు

విదా వీ1 ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫేమ్‌ 2 సబ్సిడీ, పోర్టబుల్‌ చార్జర్‌ కలుపుకొని సంస్థ ఈ ధరను నిర్ణయించింది కంపెనీ.

పోర్టబుల్‌ చార్జర్‌

విదా వీ1 ప్రొ, వీ1 ప్లస్‌ మాడళ్ల కంటే ఇది రూ.30 వేలు తక్కువ ధరకు లభించనుందని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

30వేలు తక్కువ

ఈ విదా వీ1 ప్రొ, వీ1 ప్లస్‌ మోడళ్లు  కేవలం 3.4 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది.

40 కిలోమీటర్ల వేగాన్ని

ఈ విదా వీ1 ప్రొ, వీ1 ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుందని కంపెనీ చెబుతోంది.

గంటలకు స్పీడ్‌

ఈ విదా వీ1 ప్రొ, వీ1 ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పూర్తిస్థాయి డిజిటల్‌ క్లస్టర్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్స్‌తో రూపొందించింది.

ఫీచర్స్‌