28 July 2024
TV9 Telugu
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ తన ‘హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ మీద రూ.15,000 డిస్కౌంట్ అందిస్తోంది.
భారత్‌లో హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సహకారంతో హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ తయారు చేస్తోంది.
వివిధ వేరియంట్ పై మాత్రమే లిమిటెడ్ ఆఫర్ గా అందిస్తోంది. ఆగస్టు 15 వరకూ డిస్కౌంట్ లభిస్తుందని హార్లీ డేవిడ్సన్ తెలిపింది.
త్వరలో 400-500 సీసీ సెగ్మెంట్లో మార్కెట్లోకి వస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ గెరిల్లా 450 మోటార్ సైకిల్‌కు పోటీగా హార్లీ డేవిడ్సన్ ఈ డిస్కౌంట్ అందిస్తోంది.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ లాంచింగ్ ధర రూ.2.60 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా, డిస్కౌంట్ తో రూ.2.45 లక్షలకే లభిస్తుంది.
మిడ్ వేరియంట్ వివిద్ ట్రిమ్ మెటాలిక్ థిక్ రెడ్, మెటాలిక్ డార్క్ సిల్వర్ పెయింట్ స్కీమ్స్ లో అందుబాటులో ఉంటుంది.
ఈ మోటారు సైకిల్ 3.5 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్ లెస్ టైర్స్, జియో ఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ తదితర ఫీచర్లు.
440 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 27 బీహెచ్పీ విద్యుత్, 38 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. మరెన్నో ఫీచర్స్.