5 September 2023

సిమ్‌కార్డ్‌ తీసుకునే వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు

అక్టోబర్ 1వ తేదీ నుంచి టెలికాం ఆపరేటర్లు రిజిస్టర్డ్ డీలర్‌ల ద్వారా మాత్రమే సిమ్ కార్డ్‌లను విక్రయించాల్సి ఉంటుందని గుర్తించుకోండి

రిజిస్టర్ చేయని డీలర్‌ల ద్వారా సిమ్ కార్డ్‌లను విక్రయిస్తే, రూ.10 లక్షల జరిమానా పడుతుంది

ఈ నెల 30లోపు అని అన్‌రిజిస్టర్డ్‌ పాయింట్ ఆఫ్ సేల్ (PoS)లను టెలికాం ఆపరేటర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది

 2023 సెప్టెంబర్ 30లోపు అన్‌రిజిస్టర్డ్‌ PoS/రిటైలర్ ద్వారా యాక్టివేట్ అయిన అన్ని మొబైల్ కనెక్షన్లు రీ వెరిఫికేషన్ చేయించుకోవలసి ఉంటుంది

సెప్టెంబర్ చివరి నాటికి టెలికాం కంపెనీలతో రిజిస్టర్ చేసుకోవాలి. నమోదు అయిన డీలర్స్ మాత్రమే సిమ్ కార్డులు అమ్మే వీలుండటంతో వారి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు

ఇక సిమ్ కార్డులు కొనుగోలు చేసే వ్యక్తులు తమ గురించి గతంలో కంటే ఎక్కువ సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి

 సిమ్ పాడైనా పోగొట్టుకున్నా అదే నంబర్‌ తిరిగి పొందాలంటే.. కొత్త సిమ్ కొనేటపుడు ఎలాంటి నిబంధనలను పాటించాలో పాత నెంబర్ కోసం కూడా అదే రూల్స్ పాటించాల్సి ఉంటుంది

ఇక నుంచి ఎక్కువ మొత్తంలో సిమ్‌ కార్డులను తీసుకోవడం వీలుండదు. ఈ విధానం ఎక్కవు బల్క్‌గా తీసుకునేవారికి వర్తిస్తుంది