06 October 2023
Disney+ HotStar యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త ఫ్రీ ప్లాన్స్ లాంచ్.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 హోరాహోరీ మ్యాచులకు యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.
క్రికెట్ అభిమానుల కోసం ప్రముఖ రిలయన్స్ సంస్థ జియో గొప్ప శుభవార్తను తీసుకు వచ్చింది.
Disney+ HotStar ఉచిత సబ్ స్క్రిప్షన్ తో రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ కొత్త ఫ్రీ ప్లాన్‌లను myjio App లేదా రిలయన్స్ జియో పోర్టల్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
రిలయన్స్ జియో తీసుకు వచ్చిన ఈ కొత్త క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్లను 6 రకాలుగా Disney+ Hotstar తో లాంచ్ చేసింది.
రూ.328 మొదలుకుని.. రూ.388, రూ.598, రూ.758, రూ. 808 తోపాటు రూ. 3178 ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
జియో కొత్త రూ. 328 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తోపాటు 28 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్ డైలీ 1.5GB డేటా, 100 SMS అందించనుంది.
కొత్త రూ. 328 ప్రీపెయిడ్ ప్లాన్ తో 90 రోజులు డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
జియో రూ.3,178 ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2 GB డేటా, డైలీ 100 SMS, వంటి లాభాలను అందిస్తుంది.
జియో అందించే అన్ని ప్లాన్స్ పైన 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న వారికి అన్‌లిమిటెడ్ 5G డేటా సౌలభ్యం కూడా లభిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి