జోరుగా సాగిన ధనత్రయోదశి అమ్మకాలు..
12 November 2023
ధన్‌తేరస్ రోజున బంగారం, వెండి తదితర విలువైన లోహాలు, వాటితో తయారైన నగలు, వస్తూత్పత్తుల కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల నమ్మకం.
బంగారం, వెండి కొనుగోళ్ల కస్టమర్లతో హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మార్కెట్లలో సందడి నెలకొన్నది.
మధ్యాహ్నం 12:35 నుంచి శనివారం మధ్యాహ్నం 01:57 వరకు ధన్‌తేరస్ ముహూర్తం ఉండటంతో వ్యాపారంపై జ్యుయెల్లర్స్ ఈసారి భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
ధనత్రయోదశి రెండు రోజులు వచ్చినట్టేనని వారు అంటున్నారు. కాగా, రెండు వారాల కింద 24 క్యారెట్ తులం పసిడి రూ. 63,000 పలికింది.
ఇప్పుడ బంగారం సుమారు రూ. 2,000 తక్కువకే లభిస్తుండటం సేల్స్‌కు బాగా కలిసొచ్చిందని బంగారు నగల వర్తకుల మాట.
ఇక గత ఏడాది ధంతేరస్ రోజున దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారెట్ బంగారం రేటు రూ.50,139 వరకు పలికింది.
అంతకుముందు సంవత్సరం 2021లో భారతదేశంలో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 47,644గా ఉండింది. 2022లో కంటే రూ. 2500 తక్కువగా ఉంది.
కాగా ఈ ఏడాది ధన్‌తేరస్ రోజున 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.62000గా ఉందని తెలుస్తోంది. మరి చూడాలి సేల్స్ ఎలా ఉంటుందో.
ఇక్కడ క్లిక్ చెయ్యండి