తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి!
TV9 Telugu
04 January 2024
భారతదేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు జనవరి 3వ తేదీ (బుధవారం)న కాస్త తగ్గాయి. దీంతో ప్రజలు ఖుషి అయ్యారు.
మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు మంగళవారం రోజు పెరిగి మళ్లీ నిన్నటి (బుధవారం) రోజున దిగివచ్చాయి.
దీంతో కొత్త సంవత్సరం (2024) మొదట్లో బంగారం కొనుగోలు చేస్తున్నవారికి కాస్త ఉపశమనం కలిగినట్లయిందనే చెప్పాలి.
హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 చొప్పున తగ్గి రూ. 58,500 లకు దిగివచ్చింది.
మరోవైపు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 270 చొప్పున తరిగి రూ.63,820 లకు క్షీణించింది.
క్రితం రోజు 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా 22 క్యారెట్లు రూ. 58,500, 24 క్యారెట్లు రూ. 63,820 ఉండేవి.
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మోస్తరుగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర నిన్నటి (బుధవారం) నుంచి కేజీకి రూ.300 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 80,000 లుగా ఉంది. ఇది క్రితం రోజున రూ.80,300 ఉండేది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి