07 March 2024
TV9 Telugu
బడ్జెట్ ధరలో లభించే ఈ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. అనేక అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ 110 కిలోమీటర్ల రేంజ్, గంటలకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పనిచేస్తుంది. దీని మోటారు నుంచి మంచి టార్క్ అవుట్ పుట్ వెలువడుతుంది.
2.52 కేడబ్ల్యూ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ మోడల్ ను 181 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఎస్1 ప్రీమియం ఓలా ఎలక్ట్రిక్ మోడళ్ల కంటే మెరుగైనదిగా చెప్పవచ్చు.
ఇబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ప్రయాణం చేసేటప్పుడు చార్జింగ్ గురించి చింతించకుండా, స్వేచ్ఛగా ముందుకు సాగవచ్చు.
110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ తో 3,600 డబ్ల్యూహెచ్ మోటారుతో వస్తుంది. కొండ ప్రాంతాలను ఎక్కడానికి, మలుపుల్లో సులభంగా ప్రయాణించవచ్చు.
ఓలా మోడళ్ల కంటే ఈబీఎల్ ఎఫ్ఈఓ ఈ-ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం కొంచెం తక్కువే. అయితే ఇతర అంశాల్లో మాత్రం ఎంతో మెరుగ్గా ఉంది.
సాలిడ్ యాక్సిలరేషన్, స్మూత్ హ్యాండ్లింగ్ తో లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ, జీవీఎస్ నావిగేషన్, యాంటీ – థెప్ట్ ఫీచర్ల, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో అత్యాధునికంగా తీర్చిదిద్దారు.
సాఫీగా, సురక్షిత ప్రయాణానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సరైనా స్టాపింగ్ పవర్ కోసం యాంటీ – లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చారు. దీని ధర రూ.99,999.