30 September
Subhash
ఇప్పటి వరకు భారతదేశంలో ద్రాక్ష, ధాన్యాలతో తయారు చేసిన వైన్ మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు యాపిల్స్ నుంచి తయారైన వైన్ ప్రజాదరణ పొందింది.
దేశంలోని ప్రముఖ యాపిల్ వైన్ తయారీ కంపెనీ ఎల్ 74 గోవాలో భారీ డిమాండ్ ఉంది. కొత్త సంవత్సరంలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా.
పీటీఐ వార్తల ప్రకారం.. యాపిల్ వైన్ అతి త్వరగాలో గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించబోతుంది. దీంతో అందరికి అందుబాటులో రానుంది.
యాపిల్ వైన్ కాకుండా ఇప్పుడు తేనెతో తయారు చేసిన వైన్ కూడా భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. బియ్యంతో తయారైన 'మలాయాళి' అనే బీరు కూడా భారత్‌కు వచ్చేలా ప్లాన్ చేస్తోంది.
యాపిల్‌తో తయారు చేసిన మద్యం వ్యాపారం దేశంలో అభివృద్ధి చెందుతున్న రంగం. ప్రస్తుతం దీని పరిమాణం దాదాపు 1,040 కోట్ల రూపాయాలుగా తెలుస్తోంది.
యాపిల్‌తో తయారైన మద్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా స్కోప్ ఉంది. దీని పరిమాణం దాదాపు 58,600 కోట్ల రూపాయలు.
భారతదేశంలో యాపిల్ మద్యం వ్యాపారం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది 2032 వరకు ప్రతి సంవత్సరం 5 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా.
రానున్న రోజుల్లో ఈ యాపిల్‌తో తయారైన మద్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. భారీ ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ చేసి ప్లాన్ జరుగుతోంది.