మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఆ కారుపై రూ. 65,000 వరకూ తగ్గింపు

23 December 2023

మన దేశంలోని అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల బ్రాండ్లలో మారుతి సుజుకీ మొదటి స్థానంలో ఉంటుంది. అన్ని వర్గాల వారికి అవసరమైన బడ్జెట్లో ఈ కంపెనీ కార్లు ఉంటాయి.

మారుతి సుజుకీ

వినియోగదారులకు ఆకర్షించేందుకు ప్రత్యేకమైన సేల్స్ ను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఇయర్ ఎండింగ్ సేల్స్ నిర్వహిస్తోంది.

తగ్గింపు ఆఫర్‌

ఈ డిసెంబర్ 31 వరకూ ప్రత్యేకమైన తగ్గింపు ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మారుతి సుజుకీ ఇగ్నిస్ కారుపై ఈ ఆఫర్లు ఉన్నాయి.

డిసెంబర్‌ 31 వరకు

ఫంకీ డిజైన్ లో సిటీ డ్రైవ్ కు సరిగ్గా సరిపోయే కారు. ఈ ఇగ్నిస్ కారుపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. 

ఫంకీ డిజైన్‌

మారుతి సుజుకీ ఇగ్నిస్ కారుపై రూ. 65,000 వరకూ తగ్గింపు కాగా, దీనిలో రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ చేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ బోనస్.

డిస్కౌంట్‌

ఆ ఆఫర్ కేవలం 2023, డిసెంబర్ 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ అన్ని చోట్ల ఒకేలా ఉండదు. డీలర్‌ను బట్టి మారుతుంటుంది.

డిసెంబర్‌ 31 వరకు

ఈ ఇగ్నిస్ కారు ప్రారంభ ధర రూ. 5.84లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ కారు టాటా పంచ్, హ్యూందాయ్ ఎక్స్ టర్ లకు పోటీగా మార్కెట్లో కొనసాగుతోంది.

ఈ ఇగ్నిస్‌ కారు ధర

ఈ కారులో 1.2లీటర్ కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82హెచ్పీ, 113ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఉంటుంది.  మైలేజీ కూడా 20.89కి.మీ.

 మైలేజీ