18 October 2023
పెట్రోల్ - డీజిల్ లేదా సీఎన్‌జీ వాహనాలను నడపడానికి ఉపయోగివస్తారు. అయితే విమానాలలో ఉపయోగించే చమురు ఏమిటి?
విమానాలలో విమాన ఇంధనాన్ని ఉపయోగిస్తారని అందరికి తెలిసిందే. దీనిని జెట్ ఇంధనం అని కూడా అంటారు.
జెట్ ఇంధనానికి లాంతర్లు, స్టౌవ్‌లతో ప్రత్యేక సంబంధం ఉందని తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. కిరోసిన్‌కు ప్రత్యేక స్థానముంది.
ఈ నూనెతో జెంట్ ఇంధనాన్ని తయారు చేస్తారు. వాస్తవానికి కిరోసిన్ జెట్ ఇంధనానన్ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే జెట్ ఇంధనం కిరోసిన్ నుంచి మాత్రమే తయారు చేయబడుతుంది.
జెట్ ఇంధనాన్ని కిరోసిన్ శుద్ది చేయడం ద్వారా తయారు చేస్తారు. ఇందులో జెట్ ఏ, జెట్ ఏ1 అనే రెండు రకాలు ఉన్నాయి.
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు జెట్ ఇంధనంతో స్టౌవ్‌లను కూడా నడుపుతారు. ఇది ఆహారాన్ని వండేందుకు ఉపయోగిస్తారు. లాంతర్లను వెలిగించడానికి కూడా ఉపయోగిస్తారు.
భారత దేశంలో జెట్ ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అంటారు. దీని ధర 118.19 లక్షల రూపాయలుగా ఉంది.
ఈ జెట్ ఇంధనం ధరలలో కూడా పెరుగుదల ఏర్పడుతోంది. ఇప్పటికే చాలా సార్లు ధరలు పెంచడంతో ఆ భారం ప్రయాణికులపై కూడా పడుతోంది.