పండుగల్లో లోన్ తో కారు.. ఇవి చెక్ చేసుకోవాల్సిందే.!
దసరా పండుగ సీజన్ లో కారు కొనడం శుభపరిణామంగా భావిస్తారు. మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే - దాని కోసం లోన్ తీసుకోవాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
కారు లోన్ తీసుకోవాలి అనుకునే ముందు వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేటు చెక్ చేయండి. ఏ బ్యాంకు ఏ వడ్డీ రేటుకు లోన్ ఇస్తుందో చూడాలి. వడ్డీ రేట్లలో చిన్న తేడా కూడా లాంగ్ టర్మ్ లో మీకు ఎక్కువ ఖర్చు తీసుకువస్తుంది.
మీ కారు లోన్ ఎక్కువ టైం పిరియడ్ పెట్టుకోవద్దు. వీలైనంత తక్కువ వ్యవధికి లోన్ తీసుకోవాలి. ఎక్కువ కాలానికి తీసుకునే లోన్ మీ కారు ఖరీదును పెంచేస్తుంది.
కారు లోన్ స్వల్పకాలిక లోన్ అంటే 3 నుంచి 4 సంవత్సరాలు కు విధించే వడ్డీ రేటు కంటే 0.50% వరకు ఎక్కువగా ఉండవచ్చు. లాంగ్ టర్మ్ లోన్ వాహనం ధరను 25% వరకు పెంచవచ్చు.
ప్రీ-క్లోజర్ పెనాల్టీ గురించి జాగ్రత్తగా పరిశిలించండి. కారు లోన్ తీసుకుంటున్నప్పుడు, మీరు లోన్ తీసుకుంటున్న బ్యాంక్ ప్రీ-క్లోజర్ పెనాల్టీని విధిస్తుందో లేదో చెక్ చేయాలి.
ప్రీ క్లోజింగ్ అంటే లోన్ టర్మ్ కంటే ముందే లోన్ మొత్తాన్ని చెల్లించడం. ప్రాసెసింగ్ ఫీజులు చెక్ చేసుకోండి. దాదాపు ప్రతి బ్యాంకు కార్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది.
ఎంత ప్రాసెసింగ్ రుసుము వసూలు చేస్తుందో బ్యాంకు నుంచి ముందే తెలుసుకోవాలి. ప్రత్యేక ఆఫర్లను చెక్ చేసుకోండి. చాలా బ్యాంకులు పండుగ సీజన్లలో లేదా సంవత్సరంలోని నిర్దిష్ట కాలాల్లో కారు లోన్స్ పై ప్రత్యేక ఆఫర్లను అందిస్తాయి.
అలాంటి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి. పండగ సమయంలో కారు కొనడం మంచి ఆలోచన. అదే సందర్భంలో లోన్ తీసుకుని కారు కొనాలి అనుకున్నపుడు..
అన్ని విషయాలనూ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్రస్ట్ రేట్ విషయంలో జాగ్రత్తగా కాలిక్యులేట్ చేసుకోవాలి.