ఫిక్స్ డ్ రేట్ హోమ్ లోన్.. ఫ్లోటింగ్ రేట్ ఏది బెటర్?
హోమ్ లోన్ తీసుకున్నపుడు వడ్డీరేటు తక్కువ ఉంటుంది. తరువాత అది రిపోరేట్ ఆధారంగా పెరిగిపోతుంది. దీంతో EMI లు పెరిగిపోతాయి
ఇది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ కారణంగా ఇలా జరుగుతుంది. అంటే రెపోరేట్ పెరిగినప్పుడల్లా బ్యాంకు మీ లోన్ పై వడ్డీ రేట్ పెంచేస్తూ వస్తుంది
ఇప్పుడు ఇలా హోమ్ లోన్ భారం పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న వారికీ ఆర్బీఐ ఉపశమనం కల్పించే వార్త చెప్పింది
వడ్డీరేటు విషయంలో కస్టమర్స్ ఫిక్స్ డ్ రేట్ హోమ్ లోన్ కోసం వెళ్లే అవకాశాన్ని అందించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది
ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్‌లలో, లోన్ శాంక్షన్ చేసేటప్పుడు బ్యాంక్ నిర్ణయించిన వడ్డీ రేటు... మొత్తం లోన్ టెన్యూర్ అంతా అలాగే ఉంటుంది.
రెపో రేటులో మార్పులు ఎటువంటి ప్రభావం చూపవు. మొదట్లో ఎంత వడ్డీకి లోన్ తీసుకున్నారో లోన్ తీరేవరకూ అదే రేటు కొనసాగుతుంది
దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. లోన్‌పై ఎంత EMI అవసరం.. మొత్తం ఎంత చెల్లించాలి అనేది లెక్క వేసుకుని ఖచ్చితమైన బడ్జెట్ ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడుతుంది
ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్ వడ్డీ రేటు సాధారణంగా ఫ్లోటింగ్-రేట్ ఆధారిత లోన్ కంటే ఎక్కువగా ఉంటుంది.
వివిధ రిపోర్ట్స్ ప్రకారం ఫ్లోటింగ్-రేట్ హోమ్ లోన్‌లతో పోలిస్తే, ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్‌ల వడ్డీ రేట్లు 100 నుంచి 500 బేసిస్ పాయింట్ల మధ్య తేడా ఉండవచ్చు.
అంటే 1 నుంచి 5 శాతం తేడా ఉంటుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం... రెపో రేట్-లింక్డ్, అంటే ఫ్లోటింగ్-రేటు హోమ్ లోన్‌ల కోసం వడ్డీ రేటు 9% దగ్గర ప్రారంభం అవుతుంది.
అంటే 1 నుంచి 5 శాతం తేడా ఉంటుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం... రెపో రేట్-లింక్డ్, అంటే ఫ్లోటింగ్-రేటు హోమ్ లోన్‌ల కోసం వడ్డీ రేటు 9% దగ్గర ప్రారంభం అవుతుంది.
ఫిక్స్ డ్ రేట్ హోమ్ లోన్ వడ్డీ రేటు 11.15% నుంచి 11.45% మధ్య ఉంటుంది. అంటే దాదాపు 1.2 నుంచి 1.3 శాతం ఎక్కువ.
ఈ వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. హోమ్ లోన్ తీసుకునే ముందు వాటిని పరిశీలించి మీబ్యాంకును ఎంచుకోవాలి.