18 June 2024
TV9 Telugu
ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొత్త మోడల్ వచ్చిందంటే చాలు వెంటనే కొనేస్తున్నారు.
భారత్‌లో ఆపిల్ ఐ-ఫోన్ 15 ఫోన్ ధర మళ్లీ దిగి వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ‘మెగా జూన్ బోనంజా సేల్’భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఆన్‌లైన్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఆపిల్ ఐ-ఫోన్ 15పై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది.
సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
గతేడాది సెప్టెంబర్‌లో ఐ-ఫోన్ 15 ఫోన్ బేస్ మోడల్ విత్ ఇన్‌బిల్ట్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు ధర రూ.79,990.
కానీ ఇప్పుడు రూ.67,999లకే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ మంచి కండిషన్ లో ఉంటే రూ.55 వేల వరకూ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.
సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్ కింద రూ.1000 అదనపు డిస్కౌంట్. అంటే ఐ-ఫోన్ 15 ఫోన్ రూ.66,999లకే కొనుగోలు చేయొచ్చు.
ఐఓఎస్ 17 వర్షన్‌పై పని చేస్తున్న ఐ-ఫోన్ 15 ఫోన్.. ఆపిల్ ఏ16 బయోనిక్ చిప్ కలిగి ఉంటుంది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ స్క్రీన్.