22 September 2023

ఫ్యాన్సీ నెంబర్స్‌లో ఎక్కువ డిమాండ్ వాటికే..!

ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో వాహనదారులు తగ్గేదే లే అంటున్నారు. ఆన్‌లైన్ వేలంలో పోటాపోటీగా లక్షలు కుమ్మరించి తమకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్‌ను తమ వాహనాలకు తగిలించుకుంటున్నారు. 

ఫ్యాన్సీ నెంబర్లపై వాహనదారులకున్న విపరీతమైన క్రేజ్ కారణంగా తెలంగాణ రవాణా శాఖకు ప్రతినెలా భారీగా ఆదాయం అందుతోంది.

2023లో తెలంగాణ రవాణాశాఖకు ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది.

గత 9 మాసాల్లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా తెలంగాణ రవాణా శాఖకు ఏకంగా రూ. 53.9 కోట్ల ఆదాయం వచ్చింది.  గత ఏడాది రూ.72.7 కోట్ల ఆదాయం

వాహనదారులు అత్యధికంగా ఇష్టపడే ఫ్యాన్సీ నెంబర్లలో 9999 నెంబర్ అగ్రస్థానంలో ఉంది. ఈ నెంబరు కోసం ఆన్‌లైన్ వేలంలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది.

9999 నెంబర్ తర్వాత.. 0001, 0007, 0009 ఫ్యాన్సీ నెంబర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఫ్యాన్సీ నెంబర్ల జాబితాలో ఉన్నాయి. 

ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా ఖైరతాబాద్ ఆర్టీఓలో 9999 ఫ్యాన్సీ నెంబర్ రూ.21.6 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది.

కొండాపూర్ ఆర్టీఓలో మరో వ్యక్తి 9999 నెంబర్‌ను వేలంలో రూ.12.1 లక్షలకు, మలక్‌పేట ఆర్టీఓలో ఇదే నెంబర్‌ను రూ.9.9 లక్షలకు సొంతం చేసుకున్నారు.

ఖైరతాబాద్ ఆర్టీఓలో 0009 నెంబర్ అత్యధికంగా రూ.10.5 లక్షలకు బిడ్ అయ్యింది. 9 నెంబర్‌ని చాలా మంది లక్కీగా భావిస్తున్నందునే ఈ నెంబర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.