TV9 Telugu

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్

17 Febraury 2024

వివాహాది కార్యక్రమాలే కాకుండా ఈ నెలంతా అనేక శుభకార్యాలు జరగనున్నాయి. ఇదే సమయంలో బంగారం ధర కూడా తగ్గుముఖం పడుతోంది.

గత కొద్ది రోజులుగా దేశంలో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తులం బంగారంపై దాదాపు 600 రూపాయలు తగ్గింది.

ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో చేస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57.140 రూపాయలు ఉంది 24 క్యారెట్ల ధర 62,300 పలుకుతోంది.

ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,990గా ఉండగా, 24 క్యారెట్ల ధర 62,170 రూపాయలు పలుకుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 57,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 62,720 రూపాయలుగా ఉంది.

హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,170 వద్ద కొనసాగుతోంది.

మరో వైపు బంగారంతో పాటు వెండి రేట్లు కూడా బాగానే తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర 75,500 రూపాయలు పలుకుతోంది.

పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.