ఇలా చేయకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ ఎకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి..

20 September 2023

మీరు PPF, NSC, SCSS వంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేశారా? అయితే ఈ పని కచ్చితంగా చేయాలంటున్నారు నిపుణులు.

ఈ పని చేయకపోతే అయితే మీ ఎకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి... అందుకే ఈ పనిని అస్సలు మర్చిపోకూడదు..

ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎకౌంట్స్ ని మీ ఆధార్ తో లింక్ చేయకపోతే కనుక మీ ఎకౌంట్స్ పనిచేయకపోవచ్చు అంటున్నారు నిపుణులు.

30 సెప్టెంబర్ 2023 ఈ ఇన్వెస్ట్మెంట్ ఎకౌంట్స్ కి ఆధార్ లింక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్. త్వరగా మీ ఆధార్ తో లింక్ చెయ్యండి.

ఈలోపు మీరు కనుక లింక్ చేసుకోకపోతే ఇబ్బంది పడటం ఖాయం. మీ ఎకౌంట్స్ కి ఇంట్రస్ట్ జమ కావడం నిలిచిపోతుంది.

ఎకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎటువంటి మెసేజ్ మీకు రాదు. ఎకౌంట్లోనుంచి పైసా కూడా తీయలేరు. అప్పుడు మీరు నష్టపోతారు.

మెచ్యూరిటీ తరువాత కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ఎమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉండదు. అందుకే వెంటనే ఆధార్ ను లింక్ చెయ్యండి.

సమయం తక్కువగా ఉంది. అందుకే.. మీరు వెంటనే మీ PPF, NSC, SCSS వంటి స్కీమ్స్ కి మీ ఆధార్ ని లింక్ చేసుకోండి.