ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్‌.. అకౌంట్లోకి PF వడ్డీ

11 November 2023

భారతీయ ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్‌ నిల్వలపై వడ్డీ మొత్తాలను పీఎఫ్‌ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తోంది.

ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ అవ్వగా.. ఇంకా పలువురి ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

అకౌంట్లలో కనిపించడానికి కాస్త సమయం పడుతుందని ఈపీఎఫ్‌ఓ సంస్థ ఓ ఎక్స్‌ యూజర్‌కు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ నిల్వలలపై 8.15 శాతం వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఈపీఎఫ్‌ఓ వడ్డీని ఆయా ఖాతాల్లో జమ చేస్తోంది.

ఈపీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో సర్వీసెస్‌ విభాగంలోకి వెళ్లి ‘ఫర్‌ ఎంప్లాయీస్‌’ సెక్షన్‌ ఎంచుకోవాలి.

అందులో మెంబర్‌ పాస్‌బుక్‌ను ఎంచుకోవాలి. తర్వాత లాగిన్‌ పేజీలో యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వడం ద్వారా ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ మీ అకౌంట్లోకి లాగ్ ఇన్ అయి వడ్డీ జమ అయ్యిందో లేదో తెలుసుకోండి.