పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త.. విత్‌డ్రా పరిమతి పెంపు

19 April 2024

TV9 Telugu

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. విత్‌డ్రా నిబంధనలు మార్చింది

ఈపీఎఫ్‌ఓ

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం తమ పీఎఫ్ ఖాతాల్లో నగదు ఉపసంహరణ పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది

చికిత్సకు ఖర్చు

నగదు విత్‌డ్రా పరిమితి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్లు తెలిపింది. మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకుండానే సెల్ఫ్ డిక్లరేషన్‌తో దరఖాస్తు

నగదు విత్‌డ్రా

68జే నిబంధన కింద ఈపీఎఫ్‌ ఖాతాదారులు తమ అర్హతను బట్టి విత్ డ్రా చేసుకోవచ్చునని ఈపీఎఫ్‌వో పేర్కొంది

అర్హతను బట్టి విత్‌డ్రా

 68జే నిబంధన ప్రకారం ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లు తమ పీఎఫ్ ఖాతా నుంచి తమ వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం రూ.లక్ష వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు

లక్ష విత్‌డ్రా

కనీసం నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా, శస్త్రచికిత్స చేయించుకున్నా క్లయిమ్ చేసుకోవచ్చని ఈపీఎఫ్‌వో వెల్లడించింది

ఆస్పత్రిలో

పక్షవాతం, క్షయ, క్యానర్, గుండె సంబంధ వ్యాధుల చికిత్స కోసం కూడా ఖాతాదారులు నగదు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది

వ్యాధులు

ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనం ప్లస్ డీఏ గానీ, ఈపీఎఫ్ లో ఉద్యోగి వాటా ప్లస్ వడ్డీల్లో ఏది తక్కువైతే అంత వరకూ విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుంది

బేసిక్‌ వేతనం