ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మరింత ఖరీదు.. కారణాలు ఇవే..!

19 March 2024

TV9 Telugu

ఎలక్ట్రిక్ వెహికల్స్.. ఈవీ కార్లు, ఈవీ స్కూటర్ల విక్రయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తెచ్చిన ఫేమ్-2 స్కీమ్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది.

ఫేమ్‌-2

తాజాగా కేంద్రం ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీం -2024 (ఈపీఎంఎస్).. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. 

కేంద్రం

ఈ స్కీమ్ అమలుతో ఈవీ స్కూటర్ల ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయని ఇన్వెస్ట్ మెంట్ ఇన్ ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.

ఈవీ స్కూటర్లు

తాజాగా ప్రకటించిన ‘ఈపీఎంఎస్’ ప్రకారం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఇస్తున్న సబ్సిడీ రూ.10 వేల నుంచి రూ.5,000లకు పడిపోయింది. 

సబ్సిడీ

గరిష్టంగా ప్రతి వాహనంపై సబ్సిడీ రూ.10 వేలకే పరిమితం అవుతుండటమే దీనికి కారణం అని ఐసీఆర్ఏ పేర్కొంది. 

ప్రతి వాహనంపై

 దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ లు ప్రకటించింది. 

ఈవీ తయారీని

పెరిగిన ధరల ప్రభావంతో తాత్కాలికంగా ఈవీ స్కూటర్ల క్రయ, విక్రయాలు తగ్గినా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6-8 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. 

ధరల పెంపు

వచ్చే నెల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు పెరుగనున్న నేపథ్యంలో ముందుగానే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.

ముందస్తు కొనుగోలు