యూజర్లకు షాకిచ్చిన ‘ఫ్లిప్‌ కార్ట్‌’!

10 October 2023

ప్రముఖ దేశీయ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌‌కార్ట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.ఫ్లిప్‌‌కార్ట్‌ అప్ యూజర్లకు షాక్ ఇచ్చింది.

నిత్యవసర వస్తువుల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌.

‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌ 8 నుంచి అక్టోబర్‌ 15 వరకు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది ఫ్లిప్‌కార్ట్.

‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పుణ్యామాని అక్టోబర్‌10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ అప్ పోర్టల్‌కు యూజర్లు పోటెత్తారు.

ఆ సైట్‌లో నిత్యవసర వస్తువుల్ని బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గ్రోసరీ షాపింగ్‌ చేసే సమయంలో సమస్య తలెత్తుతుందంటూ కొనుగోలు దారులు ఫ్లిప్‌ కార్ట్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు.

గ్రోసరీ షాపింగ్‌ సంబంధించి కొత్త ఆర్డర్‌లను అక్టోబర్‌ 11 మిడ్‌ నైట్‌ 12 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపింది ఫ్లిప్‌కార్ట్.

ఆన్‌లైన్‌ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం మేర పెరిగి రూ.90 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.