38 లక్షల పెళ్లిళ్లు.. రూ.5 లక్షల కోట్ల వ్యాపారం!

23 November 2023

ఈ ఏడాది నవంబర్‌ నెల 23 నుంచి డిసెంబరు నెల 15 వరకు భారతదేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.

ఈ సీజన్‌లో సుమారు 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని, ఇందు కోసం రూ. 5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారుల సమాఖ్య కాయిట్‌ అంచనా వేసింది.

పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదారులు గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని తెలిపింది.

వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న వస్తు, సేవలకు సంబంధించిన వాణిజ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ అంచనాకు వచ్చింది కాయిట్‌.

గత ఏడాది 32 లక్షల పెళ్లిళ్లు జరగ్గా, సుమారు రూ.3.75 లక్షల కోట్ల వరకు వ్యాపారం జరిగిందని వెల్లడించింది.

నవంబర్ నెలలో 23, 24, 27, 28, 29, డిసెంబర్ నెలలో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహ శుభఘడియలు అధికంగా ఉన్నాయి.

ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని, రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం ఇక్కడి నుంచే నమోదవుతుందని అంచనా.

పెళ్లిళ్ల కారణంగా అన్ని షాపింగ్ మాల్స్ లో కోలాహలం నెలకుంది. వ్యాపారం బాగా జరగడంతో వ్యాపారాలు సంతోషంగా ఉన్నారు.