బ్యాంకుల్లో స్వీప్-ఇన్ ఎకౌంట్స్ అంటే తెలుసా?

25 September 2023

చేతిలో డబ్బు ఉంటె ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మంచి రాబడి తెచ్చుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే.. రిస్క్ గురించి భయపడతారు

సేవింగ్స్ ఎకౌంట్ లో డబ్బు దాచుకోవడం వలన అంత లాభం ఉండదు. దీనికి బదులుగా FD లో డబ్బు పెడితే వడ్డీ ఎక్కువ వస్తుంది.సేవింగ్స్ ఎకౌంట్ 3% నుంచి 3.5% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. అదే FD లో అది దాదాపుగా 7 శాతం ఉంటుంది.

మీరు సేవింగ్స్ ఎకౌంట్ లో కొంత డబ్బు ఉండేలా చూసుకుని దానికంటే ఎక్కువ డబ్బు వచ్చినపుడు దానిని ఆటో మెటిక్ గా FDలోకి మారేలా చేయవచ్చు.

ఈ విధానాన్ని స్వీప్-ఇన్ సౌకర్యం అంటారు. ఇక్కడ మీరు మీ మిగులు లేదా అదనపు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. సేవింగ్స్ ఎకౌంట్ తో పోలిస్తే ఈ ఆప్షన్స్ అధిక రాబడిని అందిస్తాయి.

స్వీప్-ఇన్ సౌకర్యం ద్వారా, మీ సేవింగ్స్ ఖాతాలోని డబ్బు ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఎకౌంట్ కు బదిలీ అయిపోతుంది.

మీ నెలవారీ ఖర్చులు 50,000 రూపాయలు అనుకుందాం. స్వీప్-ఇన్ ఫీచర్ కింద, మీరు మీ ఖాతాలో 50,000 రూపాయల కటాఫ్ పరిమితిని సెట్ చేసారనుకోండి

ఇప్పుడు, మీ ఎకౌంట్ లో 50,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న ఏవైనా ఫండ్స్ ఆటోమేటిక్‌గా FDగా మారిపోతాయి. స్వీప్-ఇన్ FD కాలవ్యవధి సాధారణంగా 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది.  10 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

ఒకవేళ అత్యవసర సమయంలో, మీ ఎకౌంట్ బ్యాలెన్స్ తక్కువగా ఉండి, మీకు డబ్బు అవసరం అయితే, అవసరమైన మొత్తం FD నుంచి తిరిగి మీ సేవింగ్స్ ఎకౌంట్ లోకి స్వీప్ అవుతుంది.