భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

26 November 2023

3.11 లక్షల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలతో చైనా అగ్రస్థానంలో ఉంది. జపాన్ 1.23 ట్రిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో కలిగి ఉంది.

విదేశీ మారక ద్రవ్య నిల్వల జాబితాలో స్విట్జర్లాండ్ 876 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలతో మూడో స్థానంలో ఉంది.

590 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలతో భారతదేశం విదేశీ మారక ద్రవ్య నిల్వల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.

ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్న రష్యా దేశం దగ్గర 577 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ఈ జాబితాలో 6వ స్థానంలో ఉన్న తైవాన్‌ దేశం దగ్గర 564 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి.

427 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలతో సౌదీ అరేబియా డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు జాబితాలో 7వ స్థానంలో ఉంది.

ఈ జాబితాలో 8వ స్థానంలో కొనసాగుతున్న హాంకాంగ్‌ దేశం వద్ద 427 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి.

9వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా వద్ద 418 బిలియన్ డాలర్లు ఉన్నాయి. 10వ స్థానంలో ఉన్న బ్రెజిల్ వద్ద 344 బిలియన్ డాలర్లు ఉన్నాయి.