ఈ ట్రిక్‌తో పిల్లలకు మనీ మేనేజ్మెంట్ నేర్పించండి

24 October 2023

డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో పిల్లలు అంత తెలివిగా ఉండరు. చాలా సార్లు అనవసరంగా ఖర్చు పెడతారు. ఇలాంటి అభిప్రాయం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. 

మనీ మేనేజ్మెంట్

పిల్లల మొండితనం కారణంగా, తల్లిదండ్రులు కూడా వారి పట్టుదలని నెరవేర్చాలని చూస్తారు. ఇది పిల్లల అలవాట్లను పాడుచేయడమే కాకుండా కుటుంబ బడ్జెట్‌ను కూడా పాడు చేస్తుంది.

మనీ మేనేజ్మెంట్

భయపడాల్సిన అవసరం లేదు. ఇందుకు బదులుగా మీరు మీ పిల్లలకు డబ్బును ఎలా ఖర్చు చేయాలి.. ఎలా దాచుకోవాలనే విషయాన్ని సరైన పద్ధతిలో నేర్పించాలి.

మనీ మేనేజ్మెంట్

చిన్న స్టార్ నుంచి సూపర్ స్టార్‌గా ఎలా మారాలో వారికి చెప్పాలి. డబ్బు ఆదా చేయడం, సరైన స్థలంలో ఖర్చు చేయడం ముఖ్యం. అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

మనీ మేనేజ్మెంట్

5-7 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఆడేటప్పుడు ఈ విషయాలు నేర్పించవచ్చు. ఇందుకోసం పిల్లలకు పిగ్గీ బ్యాంకులు ఇచ్చి డబ్బు ఆదా చేసేలా వారిని చైతన్యవంతులను చేయండి.

1

ప్రతి నెలా లేదా ప్రతి వారం పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వండి. వారి వద్ద ఎంత డబ్బు ఉందో లెక్కించండి. తద్వారా పిల్లవాడు డబ్బును తప్పు స్థలంలో ఖర్చు చేయకూడదనే విషయాన్ని నేర్పించండి

2

పిల్లలతో కూర్చొని అవసరమైన ఖర్చుల కోసం బడ్జెట్‌ను తయారు చేసి, షాపింగ్‌కు వెళ్లేటప్పుడు పిల్లలను వెంట తీసుకెళ్లండి.

3

మీ ఆర్థిక పరిస్థితిని పిల్లల వద్ద ఎప్పుడూ దాచవద్దు. ఇలాంటి పరిస్థితుల్లోనే పిల్లలకు డబ్బు ప్రాముఖ్యత అర్థమవుతుంది.

4

క్రెడిట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపుల సవాళ్లకు పిల్లలను బహిర్గతం చేయండి. తద్వారా వారు బ్యాంక్ ఛార్జీలు, పన్నులు, ఫీజుల ప్రాథమిక విషయాలు అర్థం చేసుకోగలరు.

5

పుస్తకాల ద్వారా పిల్లలకు డబ్బు  మెయింటెనెన్స్ నేర్పండి. అవసరమైతే  మీరు వారికి బోర్డ్ గేమ్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. దీంతో కూడా వారు కొంత అర్థం చేసుకుంటారు.

6

ఆర్థిక ప్రణాళిక, మనీ మేనేజ్‌మెంట్‌ను అర్థం చేసుకోవడానికి పుస్తకాల సహాయం కూడా తీసుకోవచ్చు.  ఇలా కూడా వారికి అర్థం చేసుకునేందుకు ఛాన్స్ ఉంది

7