16 October 2024
Subhash
ఎయిర్ ఇండియా వంటి దేశీయ విమానయాన ఆపరేటర్లు దీపావళి ఫ్లైట్ సేల్‌ని ప్రారంభించాయి. ఈ పండగ సీజన్‌లో ధరలు తగ్గనున్నాయి.
విమాన ప్రయాణం చేసే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇప్పుడు విమాన టికెట్ ధరలు భారీగా తగ్గనున్నాయి.
ఈ దీపావళి పండగ 2024 సీజన్ కోసం విమాన ఛార్జీల తగ్గింపును అందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగనుంది.
ప్రస్తుత పండుగ సీజన్‌లో భారీగా పెరిగిన విమాన టికెట్ చార్జీలు దీపావళి నాటికి తగ్గే అవకాశాలున్నాయి.
దివాళీ, ఛత్ పూజ నాటికి దేశవ్యాప్తంగా విమాన టికెట్ ధరలు గతేడాదితో పోలిస్తే 20-25 శాతం వరకు తగ్గనున్నాయని అంచనా వేసింది ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో.
సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఇటీవలకాలంలో చమురు ధరలు దిగిరావడంతో విమాన చార్జీలు తగ్గించడానికి పలు విమానయాన సంస్థలు కసరత్తు చేస్తున్నాయని తెలిపింది.
బెంగళూరు-కోల్‌కతాల మధ్య విమాన చార్జీలు సరాసరిగా 38 శాతం వరకు తగ్గనున్నాయి. దీంతో ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది.
చెన్నై-కోల్‌కతాల మధ్య 36 శాతం, ముంబై-ఢిల్లీల మధ్య 34 శాతం, ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీల మధ్య టికెట్ ధరలు 32 శాతం వరకు తగ్గనున్నాయి.