14 November 2023
ఈ ఏడాది ధన్‌తేరాస్ బంగారం, వెండి అమ్మకాలలో కొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాదికంటే ఎక్కువనే చెప్పాలి.
ఈ ఏడాది ధన్‌తేరస్‌లో రూ.30 వేల కోట్ల విలువైన బంగారం అంటే సుమారు 41 టన్నులు, 400 టన్నుల వెండి అమ్మకాలు జరిగాయి.
ఇది గతేడాది కంటే 20% ఎక్కువ. గత కొన్నేళ్లలో ధన్‌తేరస్‌లో ఇంత మొత్తంలో వెండి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి
గత ఏడాది 32 టన్నుల బంగారం అమ్ముడుయిందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు
ధన్‌తేరస్ రోజున దేశంలో సుమారు 41 టన్నుల బంగారం, 400 టన్నుల వెండి ఆభరణాలు, నాణేలు అమ్మకాలు భారీగానే అమ్ముడు అయ్యాయి.
విదేశాల నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 800 టన్నుల బంగారం, దాదాపు 4 వేల టన్నుల వెండి దిగుమతి అవుతోందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ చెబుతోంది.
దేశంలో ఎంత మంది వ్యాపారులంటే.. దేశంలో దాదాపు 4 లక్షల చిన్న వ్యాపారులు, పెద్ద ఆభరణాల వ్యాపారులు ఉన్నారని చెబుతోంది.
ఇందులో 1 లక్షా 85 వేల మంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో నమోదైన నగల వ్యాపారులు ఉన్నారని తెలిపారు.