ఇప్పుడు డయాబెటిస్ లేదా చక్కర వ్యాధి చాలా సాధారణం గా అందరికీ వస్తున్న ఇబ్బంది. దీని కోసం ప్రతిరోజూ మందులు వాడాల్సిందే.
డయాబెటిస్ చికిత్స కోసం మందుల కోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే, దీని కోసం కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి.
కాకపొతే ఈ పాలసీ తీసుకోవడం విషయంలో అందరూ వెనకడుగు వేస్తారు. ఎందుకంటే, ఈ పాలసీల ప్రీమియం చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది.
ఇప్పుడు 4 నుంచి 5 మాత్రమే డయాబెటిస్ ను కవర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. కానీ, వీటి ధర కూడా ఎక్కువగానే ఉంది.
డయాబెటిక్ కవర్ అన్ని ఖర్చులను కవర్ చేయదు. కొన్ని OPDలను కవర్ చేస్తే కొన్ని చేయకపోవచ్చు. అలాగే బ్లడ్ టెస్ట్ ల కవర్ కూడా ఉండదు
HDFC ఎర్గోస్ ఎనర్జీ ప్లాన్, స్టార్ హెల్త్ & అలైడ్ డయాబెటిస్ సురక్షిత ఆరోగ్య బీమా ప్లాన్, ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ఎన్‌హాన్స్ డయాబెటిస్ ప్లాన్, బజాజ్ అలియన్జ్ లైఫ్ డయాబెటిక్ టర్మ్ ప్లాన్
ఎంతోమంది డయాబెటిక్ పేషేంట్స్ ఉన్నప్పటికీ నాలుగైదు కంపెనీలు మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. అదీ చాలా ఎక్కువ ప్రీమియం రేట్లతో
పెద్దవాళ్లలో ఎవరికైనా చక్కెర వ్యాధి ఉంటె అది వంశపారంపర్యంగా వచ్చే అవకాశము కూడా ఉంటుంది. అటువంటి వారు జాగ్రత్తగా ఉండడం అవసరం.