13 December 2023
ఈ రోజుల్లో ఆధార్ ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి కావాల్సిందే. బ్యాంకు అకౌంట్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఇలా ఒక్కటేమిటి అన్నింటికి ఆధార్ కావాల్సిందే.
గతంలో ఆధార్ కార్డు ఉన్నవారు పదేళ్ల తర్వాత తమ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉండేది.
తాజాగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. మరో మారు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు వచ్చే ఏడాది మార్చి 14 వరకు పొడిగింపు.
ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో గడువు పొడిగించాలని నిర్ణయించామని ఉడాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ దాటిన తర్వాత అప్‌డేట్ చేస్తే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
మరోమారు ఆధార్ సంస్థ ఉచిత ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం గడువు పెంచడంతో ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగనుంది.