7 అక్టోబర్ 2023
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు సులభమైన ఈ విధానాలతో క్షణాల్లో బ్యాలెన్స్ సులభంగా తెలుసుకోవచ్చు.
మీరు ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో మై సర్వీస్ విభాగంలోకి వెళ్లాలి.
మై సర్వీస్ విభాగంలోకి వెళ్లి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ ‘ఉద్యోగుల కోసం’పై క్లిక్ చేయండి.
'సర్వీసెస్’ విభాగం కింద ‘సభ్యుని పాస్‌బుక్’కి ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం సభ్యుని ఐడీను ఎంచుకుని పాస్‌బుక్‌ను చూడవచ్చు.
మీరు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు మరో పద్దతి కూడా ఉపయోగించవచ్చు. అదే ఎస్‌ఎంఎస్ ద్వారా
పీఎఫ్ బ్యాలెన్స్ కోసం ఈపీఎఫ్‌ఓ ఖాతాదారుడు 77382 99899కు ఎస్‌ఎంస్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చు.
ముందుగా మీరు EPFOHO UAN అని టైప్ చేసి ఆ తర్వాత 77382 99899 అనే నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాల్సి ఉంటుంది.
అలాగే 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ సులభంగా తెలుసుకోవచ్చు.