దేశంలోని బలహీన వర్గాలకు జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనను అమలు చేస్తోంది.
ఇందులో, సంవత్సరానికి రూ.20 ఖర్చుతో రూ.2 లక్షల వరకు జీవిత బీమా లభిస్తుంది, అంటే నెలకు రూ.2 కంటే తక్కువ.
ఈ పథకాన్ని మే 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బీమాను కొనుగోలు చేసేందుకు ఎలాంటి వైద్య పరీక్షలూ అవసరం లేదు.
ప్రమాదవశాత్తు రెండు కళ్లు లేదా చేతులు, కాళ్లు కోల్పోవడం వంటి శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.2 లక్షలు.. ఒక కన్ను, ఒక చేయి, ఒక కాలు కోల్పోవడం వంటి శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.లక్ష అందజేస్తారు.
దరఖాస్తుదారు వయస్సు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 70 సంవత్సరాలలోపు వ్యక్తులు మాత్రమే ఈ బీమా పొందగలరు. బీమా కాలపరిమితి ఒక సంవత్సరం, ఇది జూన్ 1 నుండి మే 31 వరకు ఉంటుంది.
ప్రభుత్వ రంగ బీమా కంపెనీల ద్వారా ఈ పథకం కింద బీమా పొందవచ్చు. ఇది కాకుండా, మీరు బ్యాంక్ ఏదైనా శాఖ నుంచి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రయోజనాన్ని పొందవచ్చు.
PMSBY ప్రయోజనాలను పొందడానికి, మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఎకౌంట్ కలిగి ఉండాలి. మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లయితే, మీరు ఈ పథకాన్ని ఒక బ్యాంకు నుంచి మాత్రమే పొందవచ్చు.
ప్రతి సంవత్సరం మే 31వ తేదీన, 'ఆటో డెబిట్' సౌకర్యం ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుండి రూ. 20 ప్రీమియం తీసివేస్తారు.
పాలసీ పునరుద్ధరణ కోసం ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే, పాలసీ రద్దు చేయబడుతుంది. ప్రీమియం అందిన తర్వాత పాలసీని పునరుద్ధరించవచ్చు. ప్రమాదం జరిగితే, 30 రోజుల్లోపు డబ్బును క్లెయిమ్ చేయాలి.