TV9 Telugu
వర్చువల్ ATM.. OTPతో దుకాణాల్లో క్యాష్ విత్‌డ్రా
15 Febraury 2024
మీ ప్రాంతంలో ఏటీఎం పనిచేయడం లేదా? క్యాష్ విత్‌డ్రా చేయడం కష్టం అవుతోందా? వర్చువల్ ఏటీఎంతో నగదు సులభంగా పొందొచ్చు.
వర్చువల్ ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే మొదటగా పేమార్ట్ బ్యాంకింగ్ యాప్‌ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
యాప్ ద్వారా బ్యాంకుకు విత్‌డ్రా రిక్వెస్ట్ చేయాలి. ఇది చేయాలంటే యూజర్ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉండాలి.
వినియోగదారుడి బ్యాంక్, ఒక ఓటీపీ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్‌ను మీ సమీపంలోని దుకాణాల్లో చూపిస్తే, వారు క్యాష్ ఇస్తారు.
ఈ సేవలు అందించే దుకాణాల లిస్ట్, లొకేషన్, ఫోన్ నంబర్ పేమార్ట్ యాప్‌లో ఉంటాయి. మూరుమూల ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ సేవలు ఉపయోగపడతాయి.
ప్రస్తుతం పేమార్ట్ చండీగఢ్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయిలో సేవలు అందిస్తోంది. మరిన్ని బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
పేమార్ట్ కంపెనీ సీఎస్సీ ఇ-గవర్నన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వర్చువల్ ఏటీఎం సేవలను త్వరలో 5 లక్షల ప్రదేశాలలో అందించనుంది.
సేవలు ఉపయోగించుకున్నందుకు పేమార్ట్ సంస్థ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయదు. ఈ సేవలు అందించే దుకాణాదారులకు కమిషన్‌తో ఆదాయం లభిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి