12 March 2024
TV9 Telugu
ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.
ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా బెంగళూరులోని ప్రధాన కార్యాలయం తప్ప దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది.
బైజూస్ సంస్థలను మూసివేస్తున్నట్లు ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
బెంగళూరు నాలెడ్జ్ పార్కులోని ఐబీసీ వద్ద ఉన్న ప్రధాన కార్యాలయం ఒకటి మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
అయితే దేశ వ్యాప్తంగా ఉన్న బైజూస్ కార్యాలయాలు సైతం మూసివేత ప్రక్రియ గత కొన్ని నెలలుగా కొనసాగుతోందని కథనాల ద్వారా తెలుస్తోంది.
ఆయా ప్రాంతాల్లో బైజూస్ ఆఫీసుల లీజు గడువులు ముగిసిన వెంటనే ఎక్కడికక్కడ ఆఫీసులు మూసివేస్తున్నట్లు తెలిపాయి.
దేశవ్యాప్తంగా బైజూస్ సంస్థలో సుమారు 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరినీ ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా సంస్థ కోరినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 1000 మంది సిబ్బంది సహా దేశవ్యాప్తంగా ఉన్న 300 ట్యూషన్ కేంద్రాల సిబ్బందికి మాత్రం వర్క్ ఫ్రం హోమ్ వర్తించదు. ట్యూషన్ కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయి.