మార్కెట్లోకి సరికొత్త కారు.. సింగిల్‌ ఛార్జ్‌తో 650 కిలోమీటర్ల మైలేజీ

06 March 2024

TV9 Telugu

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు.

మార్కెట్లో

చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ బీవైడీ.. దేశీయ మార్కెట్లోకి నయా మాడల్‌ను పరిచయం చేసింది. అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది.

బీవైడీ

మూడు వెర్షన్లలో లభించనున్న ఈ సరికొత్త కారు ప్రీమియం ఫీచర్లు, సింగిల్‌ చార్జింగ్‌తో 650 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

మూడు వెర్షన్‌లలో

కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్‌ను తొలుత బుకింగ్‌ చేసుకున్న కొనుగోలుదారులకు హోమ్‌ చార్జర్‌, వ్యారెంటీ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 

15 నిమిషాల్లోనే..

'సీల్‌' ఎలక్ట్రిక్‌ సెడాన్‌ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్‌ ప్రారంభ ధర రూ.41 లక్షలుగా నిర్ణయించిన సంస్థ.

ప్రారంభ ధర

ప్రీమియం వెర్షన్‌ 45.55 లక్షల రూపాయలు, సెడాన్‌ రకం 53 లక్షల రూపాయలకు లభించనుంది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.

ప్రీమియం వెర్షన్‌

ఎలక్ట్రానిక్‌ హైడెన్‌ ఫ్లష్‌ డోర్‌, 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్‌, ఆటోమేటిక్‌గా వర్షం సెన్సింగ్‌ వైప్స్‌, ఏసీ వెంట్స్‌ మార్చుకునే విధంగా డిజైన్‌ చేసింది. 

డిజైన్‌

అదనపు స్థలం, భద్రత, పనితీరు ఆధారంగా రూపొందించిన మూడో మాడల్‌ ఇదేనని బీవైడీ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గోపాలకృష్ణన్‌ వెల్లడించారు.

 పనితీరు ఆధారంగా