ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై బంపర్‌ ఆఫర్‌.. రూ.41,000 వరకు ఆదా

15 March 2024

TV9 Telugu

ప్రముఖ ఈ-స్కూటర్‌ తయారీదారు టీవీఎస్‌ తన ఏకైక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌పై అదిరే ఆఫర్‌ను అందిస్తోంది. 

టీవీఎస్‌

ఈ మార్చినెలలో దీనిని కొనుగోలు చేయడం ద్వారా రూ. 41,000 వరకూ ఆదా చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తోంది. 

భారీగా ఆదా

దీనిలో రూ. 6000 క్యాష్ బ్యాక్ తగ్గింపు, వినియోగదారుడు నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలు చేస్తే, రూ. 7500 అదనపు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. 

క్యాష్‌బ్యాక్‌

అదే సమయంలో రూ.5000 విలువైన ఎక్స్‌టెండెడ్‌ వారంటీ కూడా పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ 31 మార్చి 2024 వరకు మాత్రమే చెల్లుబాటు.

వారంటీ

వాస్తవానికి, ఫేమ్‌ 2 సబ్సిడీ 2024, ఏప్రిల్ 1, నాటికి నిలిచిపోతుంది. దీంతో కంపెనీలు తమ స్టాక్లను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

సబ్సిడీ

ప్రస్తుతం టీవీఎస్‌ ఐక్యూబ్‌కి రూ.22,065 సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్పై లభించే ఇతర తగ్గింపులను మొత్తం కలిపితే అది రూ. 40,564కే.

ఐక్యూబ్‌

ఈ ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఇదే ఉత్తమ సమయం. ఈ ఆఫర్‌ మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

 ఇ-స్కూటర్‌

దీని ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. టీవీఎస్‌ ఐక్యూబ్‌ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా రికార్డు నమోదు చేసింది.

టీవీఎస్‌ ఐక్యూబ్‌