29 September
Subhash
ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ ప్రపంచం నెలకొంది. ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచిన విషయం తెలిసిందే.
ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీల టారీఫ్ ప్లాన్ ధరలు పెరగడంతో మొబైల్ వినియోగదారులపై తీవ్ర భారంగా మారుతోంది.
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం తన టారీఫ్ ప్లాన్‌లను పెంచలేదు. దీంతో మరిన్ని సరికొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తుంది.
ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ తమ వినియోగదారుల కోసం మరో ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌లో 60 రోజుల కాలపరిమితితో 345 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది.
ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డాటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
4జీ సేవలు అందించడానికి సిద్ధమతున్న సంస్థకు ఈ నూతన ప్లాన్‌తో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు లభించనున్నాయని తెలిపింది.
ఇతర టెలికం సంస్థల కంటే బీఎస్‌ఎన్‌ఎల్ టారిఫ్‌లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. దీంతో ఇతర నెట్‌వర్క్ కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అవుతున్నారు.