మీ బంగారం స్వచ్ఛతను తెలిపే యాప్ బీఐఎస్ కేర్ యాప్‌

21 October 2023

కొత్తగా కొనుగోలు చేసే నగలు లేదా మీ వద్ద ఉన్న బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునే సులువైన మార్గం ఏంటో తెలుసుకుందాం.

అన్ని రకాల బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ హెచ్ యూఐడీ కోడ్ ముద్రించడాన్ని కేంద్ర సర్కారు తప్పనిసరి చేసింది.

ప్రతి ఆభరణానికీ ఈ కోడ్ భిన్నంగా ఉంటుంది. పండుగలు, వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుండడం సహజమే.

దసరా, దీపావళి పండగల సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసే వారు, బీఐఎస్ హాల్ మార్క్ ఉన్నవే కొనుగోలు చేయాలి.

హాల్ మార్క్ హెచ్ యూఐడీ అనేది ఆరు అక్షరాలు, నంబర్లతో ఉంటుంది. దీని ఆధారంగా అది నకిలీదా, అసలైనదా అన్నది తెలుసుకోవచ్చు.

ఇందుకోసం బీఐఎస్ కేర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ తెరిచి పేరు, ఫోన్ నంబర్, ఈ మెయిల్ వివరాలు ఎంటర్ చేయాలి.

నగకు నిజమైన హాల్ మార్క్ గుర్తింపు ఉంది అంటే ఎక్కడ కొనుగోలు చేశారో ఆ జ్యుయలర్స్ వివరాలు, బంగారం ఆభరణం వివరాలన్నీ కనిపిస్తాయి.

వెంటనే మీ స్మార్ట్ ఫోన్ లో బీఐఎస్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బంగారు నగలు కొనుగోలు సమయంలో మోసపోకుండా జాగ్రత్త పదండి.