మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? సులభంగా మార్చుకోండిలా! 

30 July 2024

TV9 Telugu

చాలా మంది దగ్గర పాత నోట్లు ఉంటాయి. అందులో చిరిగిపోయినవి.. లేక పూర్తిగా పాతబడినవి ఉంటాయి. కొత్త నోట్లను మార్చుకునే వెసులుబాటు ఆర్బీఐ కల్పించింది.

 పాత నోట్లు

మీ వద్ద పాత నోట్లు ఏమైనా ఉండి.. వాటిని చెల్లించే విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 

పాత నోట్లు

వాటి స్థానంలో కొత్త నోట్లను బ్యాంకుకు వెళ్లి పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. 

కొత్త నోట్లు

మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను కలిగి ఉంటే, మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పనిని చేయవచ్చు.

బ్యాంకు

మీ స్వంత బ్యాంకు మీ స్వంత శాఖను సందర్శించాలి. అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చు. 

 స్వంత శాఖ

చాలా పెళుసుగా ఉన్న నోట్లు, కాలిపోయినవి లేదా సాధారణంగా హ్యాండిల్ చేయలేని స్థితికి చేరిన, అతుక్కుపోయిన నోట్లను సాధారణ బ్యాంక్ బ్రాంచ్‌లలో మార్పిడి చేయలేము.

మార్పిడి

ఇలాంటి నోట్లు ఉన్నవాళ్లు ఆర్బీఐ ఇష్యూ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ వాటిని ప్రత్యేక విధానంలో సరిచూసి మీకు డబ్బులు తిరిగి చెల్లిస్తారు.

ఆర్బీఐ

2022 ఏప్రిల్ 1 నాటి ఆర్​బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, ఎవరైనా 5 కంటే ఎక్కువ నోట్లను సమర్పించినా, వాటి మొత్తం విలువ రూ.5,000 మించరాదు. సమీపంలోని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్‌కు పంపించాలి. 

మాస్టర్ సర్క్యులర్