21 September
Subhash
యూపీఐ లైట్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో యూజర్లు ఆటో టాప్ అప్ సదుపాయాన్ని పొందనున్నారు. మరింత ప్రయోజనం చేకూరనుంది.
యూపీఐ లైట్‌లో వచ్చే ఫీచర్‌తో వినియోగదారులు తమ ఖాతాలో బ్యాలెన్స్‌ని పదే పదే చేర్చుకునే అవాంతరాల నుంచి బయటపడతారు
ఎన్‌పీసీఐ సర్క్యులర్ ప్రకారం, అక్టోబర్ 31 నుండి వినియోగదారులు తమ యూపీఐ లైట్ ఖాతాలో తమకు నచ్చిన మొత్తాన్ని తిరిగి డిపాజిట్ చేయడానికి ఆటో టాప్-అప్ ఎంపిక.
వినియోగదారులు ఎంచుకున్న మొత్తంతో UPI లైట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా రీలోడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
యూపీఐ లైట్ వాలెట్‌లో ఎప్పుడైనా రూ. 2000 వరకు లోడ్ చేయడానికి, అలాగే యూపీఐ పిన్‌ని ఉపయోగించకుండా వాలెట్ నుండి రూ. 500 వరకు చెల్లింపులను చేయవచ్చు
రీలోడ్ చేయడం అనేది యూపీఐ లైట్ బ్యాలెన్స్ పరిమితిని రూ. 2,000 కంటే మించదని గమనించడం ముఖ్యం.
యూపీఐ లైట్‌లో డబ్బు ఉంచడానికి గరిష్ట పరిమితి రూ. 2,000. అంటే కస్టమర్లు ఒకేసారి రూ.2,000 మాత్రమే ఆటో-టాప్ చేయవచ్చు.
ఒక రోజులో గరిష్టంగా 5 సార్లు మాత్రమే బ్యాంక్ ఖాతా నుండి యూపీఐ లైట్ ఖాతాకు నిర్ణీత మొత్తాన్ని జోడించవచ్చు.