ఏ పనిచేయకుండానే డబ్బులు రావాలని ఆశపడుతున్నారా? అదెప్పుడు సాధ్యమంటే..

21 December 2023

TV9 Telugu

పాసివ్‌ ఇన్‌కమ్‌ అంటే భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా ముందస్తుగా పొదుపు చేయడం. పకడ్బందీగా వ్యవహరించడమే ఇందులోని పరమార్థం.

మన దగ్గర ఉన్న మూలధనం నుంచి గానీ, ఆస్తి ద్వారా గానీ అవసరాలకు తగ్గట్టుగా ఆదాయం సమకూర్చుకోవడమే పాసివ్‌ ఇన్‌కమ్‌.

సంపాదన బలంగా ఉన్నప్పుడు ప్రత్యేక సందర్భాల కోసం డబ్బును పదిలపరచి, ఆయా సమయాల్లో వినియోగించుకునే సొత్తు.

మనకి వచ్చిన ఆదాయాన్ని పొదుపు, మదుపు చేయడం ద్వారా భారీ ఖర్చులు కూడా చాల తేలికైపోతాయని అంటున్నారు నిపుణులు.

మీ ఆదాయం ఘనంగా ఉన్నప్పుడు మూలధనాన్ని కదిలించకుండానే వచ్చే వడ్డీ ద్వారా ఈ పనులన్నిటినీ చక్కబెట్టొచ్చు.

పాసివ్‌ ఇన్‌కమ్‌ ప్రిన్సిపల్‌ పదవీ విరమణ తర్వాత చక్కగా ఉపయోగమవుతుంది. నెలవారీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వచ్చేలా చేసుకుంటే విశ్రాంత జీవితం ప్రశాంతంగా కొనసాగించొచ్చు.

చిన్నచిన్న పనులకే మీ దగ్గర ఉన్న మూలధనాన్ని కదిలిస్తూ ఉంటే.. భారీ అవసరం ఏర్పడినప్పుడు నిధుల కొరత రావచ్చు.

దీనిని దృష్టిలో ఉంచుకొని యాక్టివ్‌గా ఉన్నప్పుడే పావివ్‌ ఇన్‌కమ్‌ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.