మెచ్యూరిటీ కావర్ తో పాటు ప్రతి సంవత్సరం ఆదాయం ఈ ఇన్సూరెన్స్ పాలసీల స్పెషాలిటీ
28 September 2023
పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ని పార్ పాలసీ అని కూడా అంటారు. ఇది ఇన్సూరెన్స్ కవర్ తో పాటు మెచ్యూరిటీ సమయంలో హామీ ఇచ్చిన మొత్తాన్ని అందిస్తుంది.
అంతేకాకుండా, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కంపెనీ లాభంలో కొంత భాగం పాలసీ హోల్డర్ కి కూడా చెల్లిస్తుంది. ఈ మొత్తం బోనస్ లేదా డివిడెండ్‌గా ఇస్తారు.
నాన్-పార్టిసిటింగ్ పాలసీలు సాధారణంగా హామీ ఇచ్చిన ప్రయోజనాలను మాత్రమే అందిస్తాయి. పాలసీహోల్డర్ కు ఎలాంటి లాభం లేదా డివిడెండ్ అందదు.
మీ పాలసీ ప్రీమియం 30 వేలు అనుకుందాం. సంవత్సరం బోనస్ 2 వేలు వచ్చింది అనుకుందాం. అప్పుడు తరువాతి సంవత్సరం మీరు 28 వేలు ప్రీమియం కడితే సరిపోతుంది.
లేదంటే, ఆ రెండు వేలు మీ పాలసీ మొత్తానికి కలిసేలా ఉంచుకోవచ్చు. అది మెచ్యూరిటీ సమయంలో మెచ్యూరిటీ ఎమౌంట్ తో కలిపి తీసుకోవచ్చు.
అదీ కాదంటే, ప్రతి సంవత్సరం మీ బోనస్ ఎమౌంట్ మీ బ్యాంక్ ఎకౌంట్ కి క్రెడిట్ అయ్యేలా ఆప్షన్ తీసుకోవచ్చు.
టాక్స్ మినహాయింపుల విషయానికి వస్తే మీ సంవత్సర ప్రీమియం హామీ మొత్తంలో 10% కంటే ఎక్కువ కానట్లయితే, మెచ్యూరిటీ సమయంలో బోనస్ - అందుకున్న మొత్తం పన్ను రహితం.
ఏప్రిల్ 1, 2023 తర్వాత కొనుగోలు చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వార్షిక ప్రీమియం ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే, దాని పై వచ్చే ఆదాయం పన్ను రహితంగా ఉండదని గుర్తుంచుకోండి.
పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ పాలసీ చాలా ఖర్చులతో వస్తాయి. దీని ఫలితంగా పెట్టుబడిపై నికర రాబడి సంవత్సరానికి 6% కంటే ఎక్కువ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకున్నపుడు మీ ఆర్ధిక సలహాదారుని సూచనలతో మీ రిస్క్ ప్రొఫైల్, ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ ఫోలియో ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది.