టెస్లా కంపెనీ కీలక నిర్ణయం.. 2 మిలియన్లకు పైగా కార్ల రీకాల్

15 December 2023

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు గట్టి షాక్ తగిలింది. అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్‌ చేసింది.

టెస్లాకు షాక్‌

యూఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేటర్ల ద్వారా రెండు సంవత్సరాల పరిశోధన అనంతరం ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా తన వాహనాలను 2 మిలియన్లకు పైగా రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది. 

2 మిలియన్లకు పైగా రీకాల్ 

ఆటోపైలట్‌ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరి చేసేందుకు, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌కు ఈ నిర్ణయం.

ఆటోపైలట్‌ విధానంలో..

దాదాపు 20 లక్షల పైచిలుకు కార్లను రీకాల్ చేసింది. 2012 అక్టోబర్‌ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్‌ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్‌ మోడల్స్‌ వీటిలో ఉన్నాయి. 

 20 లక్షల పైగా రీకాల్‌

2015 చివరిలో ఆటోపైలట్ ప్రవేశపెట్టినప్పటి నుండి అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని టెస్లా కార్లను రీకాల్ చేస్తుంది.

అన్ని టెస్లా కార్లు రీకాల్‌

ఆటోపైలట్ మోడ్‌తో కనుగొనబడిన సమస్యలను పరిష్కరించడానికి టెస్లా సాఫ్ట్‌వేర్ అధునీకరించేందుకు రీకాల్ చేసినట్లు సంస్థ తెలిపింది. 

ఆటోపైలట్‌ మోడ్‌లో

నేషనల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, విచారణలో డ్రైవర్ చురుకుదనాన్ని పర్యవేక్షించే ఆటోపైలట్ సామర్థ్యంలో లోపాలు బయటపడ్డాయి. 

లోపాలు

అక్టోబర్‌లో టెస్లా 54,676 యూనిట్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఈ లోపాన్ని పరిష్కరించడానికి కంపెనీ ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

 అక్టోబర్‌లో..