ఆదివారం అన్ని బ్యాంకులు ఓపెన్!
TV9 Telugu
23 March 2024
మార్చి 29 గుడ్ ఫ్రైడే, మార్చి 30 శనివారం, మార్చి 31 ఆదివారం. దీంతో రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి 31న ఆదివారం అన్ని బ్యాంకు శాఖలను తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడి.
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్నందున, అన్ని లావాదేవీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రమే లెక్కించాలని కోరిన RBI.
2023-24 ఆర్థిక సంవత్సరంలోనే అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడానికి బ్యాంకులను తెరిచి ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశాలు.
ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం దేశంలోని అన్ని బ్యాంకులు, ప్రభుత్వం నుండి ప్రైవేట్ వరకు మార్చి 31 ఆదివారం తెరిచి ఉంటాయి.
ప్రభుత్వ వ్యాపారానికి సంబంధించిన అన్ని శాఖలను మార్చి 31, 2024 (ఆదివారం) తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ.
పెండింగ్‌లో ఉన్న పన్ను సంబంధిత పనుల దృష్ట్యా, ఐటీ శాఖ మార్చి 29 నుండి మార్చి 31, 2024 వరకు వారాంతం రద్దు.
వరుస సెలవులు కారణంగా వారాంతంలో అన్ని శాఖలకు సెలవులు రద్దు చేయాలని ఆదేశించిన ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను కార్యాలయాలు మార్చి 29, 30,31 తేదీలలో తెరిచి ఉంటాయని వెల్లడి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి