బంగారు ఆభరణాలు కొనాలంటే హాల్ మార్కింగ్ తప్పనిసరి. ఈ నిబంధన అమలుకు నోడల్ ఏజెన్సీ ఏదంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)
రిజిస్టర్డ్ బంగారు ఆభరణాల దుకాణాలలో మాత్రమే బంగారం తీసుకోవాలని రిజిస్టర్డ్ కానీ వాటిలో కొనవద్దని వెల్లడించింది కేంద్రం.
ప్రస్తుతం ప్రతి రోజూ నాలుగు లక్షల బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ జరుగుతుందని కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో ఇంతకుముందు ఏడు జిల్లాల్లో మాత్రమే హాల్ మార్కింగ్ నిబంధన అమల్లో ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య మరో ఐదుకు పెరిగింది.
ఇంతకుముందు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన అమలైంది.
తాజాగా హాల్ మార్కింగ్ నిబంధన జాబితాలో మేడ్చల్-మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలు చేరాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని 17 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ నిబంధన అమలవుతోంది. తాజాగా అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలు కొత్తగా యాడ్ అయ్యాయి.