ఆధార్ ఉంటె 3 లక్షలు లోన్ మీకోసం.. వాట్సప్ లో మెసేజ్ హల్ చల్.. ఇది నిజమేనా?
08 September 2023
మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉందా? అయితే డీటైల్స్ ఇవ్వండి. మీ ఎకౌంట్ లోకి ౩ లక్షల రూపాయలు వచ్చిపడిపోతాయి.
మీకు కూడా ఇటువంటి మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, ఇటీవల కాలంలో చాలామందికి ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయి.
ఇందులో ప్రధానమంత్రి లోన్ యోజన పతాకంలో ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ ౩ లక్షల రూపాయల లోన్ ఇస్తున్నారని పేర్కొని ఉంటుంది.
ఇందుకోసం మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డిటైల్స్ ఇవ్వాలి అంతే అని ఆ మెసేజ్ లో చెబుతు మోసాలకు పాల్పడుతున్నారు.
ఒక లింక్ దానితో పాటు పంపిస్తారు. పొరపాటున కూడా అటువంటి లింక్ క్లిక్ చేయకండి.జాగ్రత్తగా లేకుంటే లాంటి అంతే సంగతులు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ మెసేజ్ లు ఫేక్ అని నిర్ధారించింది.అందుకే ఈ మెసేజ్ లు పట్ల అప్రమత్తంగా ఉండండి.
అలాగే ఇటువంటి మెసేజ్ మీకు వస్తే ఎవరికీ షేర్ చేయవద్దని కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హెచ్చరిస్తోంది.
మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన లోన్ ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండదని మీరు తెలుసుకోండి.వీటికి దూరంగా ఉండండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి