అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ గేమింగ్స్‌పై 28 శాతం జీఎస్టీ

30 సెప్టెంబర్ 2023

వస్తు-సేవల పన్ను అంటే GST అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతంగా మారబోతోంది

28 శాతం జీఎస్టీ

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధింపు విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ సంజయ్ అగర్వాల్ వెల్లడించారు

సీబీఐసీ చైర్మన్‌

సెప్టెంబర్ 30లోగా అన్ని రాష్ట్రాల శాసనసభలు జిఎస్‌టి సవరణ బిల్లు 2023ని ఆమోదించాలని లేదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు

 సెప్టెంబర్‌ 30లోగా..

ఇది అమలులోకి వచ్చిన 6 నెలల తర్వాత ఫలితాలను రివ్యూ చేస్తామని చైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు

 ఫలితాల రివ్యూ

ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ జూలైలో ప్రకటన

 జీఎస్టీ కౌన్సిల్‌లో ప్రకటన

ఈ ఆన్‌లైన్‌ గేమింగ్స్‌పై జీఎస్టీ విధింపు అంశంపై ఆగస్టు 2న జరిగిన 51వ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు

తుది నిర్ణయం

ప్రస్తుతం చాలా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నాయి. క్యాసినోలు, బెట్టింగ్ అలాగే అవకాశంతో కూడిన ఇతర గేమ్‌లు 28% జీఎస్టీ పరిధిలో ఉంటాయి

 ప్రస్తుతం జీఎస్టీ ఎంత?

గుర్రపు స్వారీ లేదా గుర్రపు పందేలలో, ఒక బెట్టింగ్ కు వచ్చే వాటా విలువపై ప్రభుత్వం 28% జీఎస్టీ వసూలు చేస్తుంది

వాటా విలువపై జీఎస్టీ