ఈ కంపెనీల నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కార్లు రానున్నాయ్‌.. మైలేజీ ఎంతంటే

13  January 2024

TV9 Telugu

మార్కెట్లో ఈవీ వాహనాల జోరు పెరుగుతోంది. ఎక్కువ మైలేజీ ఇచ్చే విధంగా కార్లను అందుబాటులోకి వస్తున్నాయి

మార్కెట్లో..

అత్యాధునిక ఫీచర్స్‌తో సింగిల్‌ ఛార్జింగ్‌తో ఎక్కువ మైలేజీ ఇచ్చే విధంగా రూపొందిస్తున్నాయి

సింగిల్‌  ఛార్జింగ్‌తో

టాటా నుంచి ఈవీ కారు మార్కెట్లోకి రానుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికల్లో రానుంది. ఒక్కసారి ఛార్జ్‌తో315 కి.మీ

టాటా పంచ్ ఈవీ..

మారుతి సుజుకీ నుంచి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇది సింగిల్ చార్జ్పై దాదాపు 550కి.మీ మైలేజి ఇవ్వనుంది

మారుతి సుజుకీ ఈవీఎక్స్..

ఓ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ను లాంచ్ చేసేందుకు ప్రణాళిక చేసింది. రెండు బ్యాటరీ ఎంపికలతో రానుంది. ఒక్కసారి ఛార్జ్‌తో 550-700కి.మీ మైలేజీ

బీవైడీ ఎలక్ట్రిక్ సెడాన్..

మహీంద్రా ఎక్స్ యూవీ300 ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని పూర్తి వివరాలు వెల్లడించకపోయినా మైలేజీ బాగా ఇస్తుందని తెలుస్తోంది

మహీంద్రా ఎక్స్ యూవీ 300..

మహీంద్రా నెక్ట్స్ జెన్ ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్ లో ఉంది. ఈ ఎక్స్ యూవీ కారు 80కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీతో వస్తుంది. రెండు పవర్ అవుట్ పుట్లను అందిస్తుంది

మహీంద్రా ఎక్స్ యూవీ

టాటా మోటార్స్ నుంచి మరో ఈవీ కారు రానుంది. రెండు బ్యాటరీ ప్యాక్ లతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ మైలేజీ ఇచ్చే అవకాశం

టాటా హారియర్..