ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.
ఈ బడ్జెట్‌లో అనేక రకాల వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచే ప్రకటన వెలువడవచ్చు.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం, 'ఆత్మనిర్భర్ భారత్' చేయడానికి తన ప్రయత్నాలను పెంచబోతొంది కేంద్రం
దీని కోసం 2023 కేంద్ర బడ్జెట్‌లో దాదాపు 35 వస్తువులపై కస్టమ్ డ్యూటీని పెంచాలని మోడీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
నగలు, ప్లాస్టిక్ వంటి వాటిపై కస్టమ్ సుంకం పెరిగే ఛాన్స్ ఉంది
ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పెంచే కొన్ని వస్తువులలో ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్లు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, నగలు, హై-గ్లోస్ పేపర్, విటమిన్లు ఉన్నాయి.
దిగుమతులను తగ్గించడం.. స్థానిక తయారీదారులను ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకుంటున్నారు